ప్రజావాణి కి 42 ఆర్జీలు, ప్రజావాణి సమస్యల సత్వర పరిష్కారానికి చొరవ చూపాలి-జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య .

తేది:5- 1- 2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.

సంగారెడ్డి జిల్లా :ప్రజావాణి లో వచ్చిన సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులకుసూచించారు . కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అడిషనల్ కలెక్టర్లుమాధురి,పాండు ,నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతిలతో కలిసి వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా అర్జీదారులు భూ సమస్యలు, ఆసరా పింఛన్లు, ఉద్యోగ కల్పన,తదితర అంశాలతో పాటు పంచాయతి, వ్యవసాయ, DWO, హౌసింగ్, లేబర్,పి డబ్ల్యూ డి, డి ఆర్ డి ఓ, మున్సిపల్, రెవెన్యూ, బి సి డి ఓ, మైన్స్, డి ఎస్ సి ఓ తదితర శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను కలెక్టర్ కు అందజేశారు. ఆయా వినతులను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకుఆదేశించారు.ప్రజావాణి లో 42 అర్జీలు అందాయని తెలిపారు.
ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమమని , ఆర్జి దారుల సమస్యలను వెంట వెంటనే పరిష్కరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, కలెక్టరేట్ ఏ ఓ, ప్రజలు, పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *