తేది:5- 1- 2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.
సంగారెడ్డి జిల్లా: బేటి బచావో బేటి పడావో కార్యక్రమంతో బాలికల బంగారు భవిష్యత్ కు పునాది పడుతుందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు.
జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా సాధికారిత కేంద్రం ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయిలో విద్యా మరియు క్రీడా రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో
జిల్లా కలెక్టర్ పి. ప్రవీణ్య కిట్లు, అవార్డు సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,“బాలికలు అన్ని రంగాలలోనూ ముందంజలో నిలుస్తూ జిల్లాకు గర్వకారణంగా మారుతున్నారని, ప్రభుత్వం బాలికల సాధికారతకు అనేక పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉద్బోధించారు.
విద్యతో పాటు క్రీడల్లో కూడా బాలికలు రాణిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు.
కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక బ్యాగ్, ట్రాక్ సూట్, వాటర్ బాటిల్, మోటివేషనల్ పుస్తకం, టీ-షర్ట్‌తో పాటు అవార్డు సర్టిఫికెట్‌ను అందజేశారు.
జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచి అవార్డులు అందుకున్న విద్యార్థులు:ఎం. రంజన్ కుమారి, భావన, మాల్విక, అశ్విని, ఋత్విక రెడ్డి, వైష్ణవి, ఎం. శైలజ, పి. గౌతమి, భూమిక, ప్రవళిక.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మాధురి, పాండు , సబ్ కలెక్టర్ ఉమా హారతి,జిల్లా సంక్షేమ అధికారి కె. లలిత కుమారి, జిల్లా సమన్వయకర్త పల్లవి, అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.