కాల్‌మనీ వేధింపులతో మెదక్ రామ్‌నగర్‌లో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం.

తేది:5-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా : మెదక్ జిల్లాలో మక్తాబుపతిపూర్‌కు చెందిన చిటికెల అశోక్ మెదక్ పట్టణం రామ్ నగర్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చిన ప్రైవేట్ ఫైనాన్స్ వ్యక్తుల వేధింపులు, బలవంతంగా అతడి కారును తీసుకుపోవడమే ఈ ఘటనకు కారణమని సమాచారం.
ఫైనాన్స్ ఇచ్చిన వారు అప్పు డబ్బులు, అధిక వడ్డీ చెల్లించాలని నిరంతరం ఒత్తిడి చేయడమే కాకుండా, అశోక్‌కు చెందిన కారును కూడా బలవంతంగా స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్యల వల్ల అశోక్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలుస్తోంది.
స్థానికులు ఘటనను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అశోక్‌ను చికిత్స నిమిత్తం సమీప మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులకు.పిర్యాదు చేశారు, ఈ కేసును సీరియస్‌గా తీసుకుని ఉన్నతస్థాయి విచారణ జరిపి న్యాయo చెయ్యల్సింధిగా బాధిత కుటుంబ కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *