కొండగట్టు గిరిప్రదక్షిణ ప్రాజెక్టు కొరకు ప్రభుత్వానికి అంచనా ప్రతిపాదనలు – జిల్లా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి, స్థానిక ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం చొరవతో సమస్య పరిష్కారం దిశగా అడుగులు – గిరిప్రదక్షిణ రహదారిని ప్రత్యక్షంగా పరిశీలించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.

తేది:05-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: ప్రభుత్వ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంతంలో భక్తులు గిరిప్రదక్షిణ చేయడానికి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సోమవారం కొండగట్టు లోని రోడ్డు మార్గాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ:
కొండగట్టు ఆలయం చుట్టూ భక్తులు గిరిప్రదక్షిణ చేయడానికి కావాల్సిన ఏర్పాట్ల గురించి రెవిన్యూ, ఫారెస్ట్, ఆర్ & బి, పంచాయతీ రాజ్ మరియు సంబంధిత అధికారులతో పరిశీలించడం జరిగిందని తెలిపారు.
గిరిప్రదక్షిణ కొరకు ముఖ్యంగా రోడ్డు విస్తారంగా ఉండాలని మార్గ మధ్యలో భక్తులకు త్రాగునీరు, శౌచాలయాలు, విశ్రాంత కేంద్రాలు మరియు తదితర అంశాల గురించి సంబంధిత అధికారులకు సూచించడం జరిగిందని తెలిపారు.
అలాగే గిరిప్రదక్షిణ కొరకు అంచనా ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
• గిరిప్రదక్షిణ రహదారి మొత్తం పొడవు – 6 కిలోమీటర్లు
• ఇందులో 3 కిలోమీటర్లు ఘాట్ రోడ్, మిగతా మార్గం మట్టి రోడ్డు
• 50 ఫీట్ల వెడల్పుతో రహదారి నిర్మాణానికి ప్రణాళిక
• 30 ఫీట్ల రోడ్డు, 20 ఫీట్ల ఫుట్‌పాత్ నిర్మాణంపై అధ్యయనం
• భక్తుల సౌకర్యార్థం లైటింగ్, పార్కింగ్ సదుపాయాల కల్పన
• 1150 మీటర్ల రహదారి ఫారెస్ట్ పరిధిలోకి వస్తుందని గుర్తింపు
• గిరిప్రదక్షణకు ఫారెస్ట్ శాఖ పూర్తి సహకారం ఇస్తుందని డీఎఫ్ఓ స్పష్టం
• ఫారెస్ట్ భూమికి బదులుగా ఎండోమెంట్ భూమి ఇచ్చే ప్రతిపాదన
• జిల్లా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం చొరవతో సమస్య పరిష్కారం దిశగా అడుగులు
అరుణాచలం, సింహాచలం తరహాలో గిరిప్రదక్షిణ ఏర్పాట్ల కు ప్రణాళిక చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు.
ఇందుకుగాను దాదాపు 40 ఫీట్ల రోడ్డు వెడల్పు పనులు, విద్యుత్ దీపాలు, అటవీ శాఖ అనుమతుల గురించి మరియు పనుల అంచనా వ్యయాల గురించి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు.
ఈ పరిశీలనలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బి. రాజ గౌడ్, జిల్లా అటవీ శాఖ అధికారి మాదాసు రవి ప్రసాద్, జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, కొండగట్టు ఈ.వో శ్రీకాంత్ రావు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *