సంక్షేమానికి సరికొత్త దారి బీసీ హాస్టళ్లలో బ్లాంకెట్ల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్, ప్రభుత్వ నిధులు వినియోగించకుండా సేవా కార్యక్రమం.

తేది:5-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా:ఆదివారం నాడు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని, ప్రభుత్వ డబ్బు ఖర్చు చేయకుండా జిల్లా అధికారులు, వారి సిబ్బంది, ప్రజా ప్రతినిధుల సహకారంతో విద్యార్థుల కోసం సమకూర్చిన బ్లాంకెట్లను పంపిణీ చేశారు. రామాయంపేట మండలం డి.ధర్మారం బీసీ హాస్టల్‌లో 55 మంది విద్యార్థులకు బ్లాంకెట్లు అందజేయగా, అనంతరం నార్సింగ్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌ను సందర్శించి అక్కడి విద్యార్థులకు కూడా బ్లాంకెట్లు అందజేశారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ గారు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *