రామచంద్రాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం – యువతి మృతి.

తేది:04-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.

సంగారెడ్డిజిల్లా:రామచంద్రాపురం పరిధిలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, 04 జనవరి 2026 ఉదయం సుమారు 8 గంటల సమయంలో రామచంద్రాపురం డైమండ్ పాయింట్ ఎదురుగా, సాయి కాలనీ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది.
మృతురాలు ఉమామహేశ్వరి (28). ఆమె బీరంగూడలోని మజిల్ టాక్ జిమ్‌లో పని చేస్తుండగా, విధులకు వెళ్లేందుకు ఆక్టివా స్కూటీ నంబర్ TS07GK2968 పై బయలుదేరింది. ఈ క్రమంలో APSRTC బస్సు నంబర్ AP39UL4556 ఆమె స్కూటీని ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు వెనుక టైరు ఆమె ఎడమ భుజంపై ఒత్తుకొనడంతో ఆమె కింద పడిపోగా, తల మరియు ఎడమ చేతి భాగాల్లో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై మృతురాలి తల్లి శ్రీమతి గంటా సావిత్రి (వయసు 50), తండ్రి పేరు లేటు నాగభూషణం, నివాసం బాంబే కాలనీ, రామచంద్రాపురం, సంగారెడ్డి జిల్లా ఫిర్యాదు అందజేశారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, చట్టప్రకారం తదుపరి చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *