తేది: 04-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గం ఇన్చార్జ్ కొన్యాల మహేందర్.
సంగారెడ్డి జిల్లా: ఈరోజు పటాన్చెరు లో శ్రామిక్ భవన్ నుంచి జాతీయ రహదారి వరకు కొత్త వెనుజులపై అమెరికన్ దాడినీ నిరసిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగినది .
ఈ సందర్భంగా సిఐటీయూ జిల్లా కోశాధికారి కే రాజయ్య మాట్లాడుతూ వెనిజులపై దాడిని ప్రపంచం మొత్తం ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు, ఒక దేశం పై అమెరికా పెత్తనం ఏమిటి అని ప్రశ్నించారు, టెర్రరిస్టుల కంటే భయంకరంగా అమెరికన్ సైన్యం వివరించిందని ఆయన అన్నారు, ఒక దేశ అధ్యక్షుడు భవనంపై రాత్రిపూట దాడి చేసే, ప్రజల ప్రాణాలు తీసి అధ్యక్షుని అతని భార్యని కిడ్నాప్ చేయడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు, అమెరికాకు ఎవరు హక్కు ఇచ్చారని ఆయన అన్నారు, దీనిని అన్ని దేశాలు తీవ్రంగా ఖండించాలని ఆయన అన్నారు . అమెరికన్ సామ్రాజవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని ఆయన అన్నారు, గత అనేక సంవత్సరాల నుంచి వెనుజుల దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని, తమ చెప్పు చేతిలో ఉంచుకోవాలని అమెరికా కోరుకున్నదని ఆయన అన్నారు, వెనుజులలో ప్రపంచంలోనే ప్రత్యమే ఆర్థిక విధానాలను అమలు చేస్తున్న దేశమని, అది ప్రజా ప్రభుత్వమని ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నాను ఆయన అన్నారు, వెనిజులలో ఇంధన నిక్షేపాలు గనినీయంగా దేశంలో ఉన్నాయని ఆయన అన్నారు. ఇంధనం పైన పెత్తనం కోసమే అమెరికన్ దాడి చేసిందని ఆయన అన్నారు, ఇప్పటి వరకు వెనుజుల అధ్యక్షులు భార్య ఎక్కడ ఉందో కూడా ప్రకటన చేయలేదని ఆయన అన్నారు, ఆయన భార్యను వెంటనే మీడియాకు చూపించాలని డిమాండ్ చేశారు. వెనిజుల నుంచి అమెరికన్ సైన్యం వెంటనే వెనుకకు పోవాలని ఆయన అన్నారు, అమెరికన్ దానిని భారత దేశ ప్రజలందరూ సంఘాలు పార్టీలు ఖండించాలని పోరాటం రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, నాయకులు శ్రీనివాస్, రామకృష్ణ, సాయన్న, నరసింహారెడ్డి, నరసింహులు, నారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.