పామాయిల్ తోటలో పామాయిల్ మొక్కలను అపహ రించి న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి పామాయిల్ మొక్కల విలువ సుమారు లక్ష రూపాయలు వేంసూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

తేది:4-1-2026 ఖమ్మం జిల్లాTSLAWNEWS వేంసూరు మండలం రిపోర్టర్ మహమ్మద్ బుర్హానుద్దీన్.

ఖమ్మం జిల్లా:వేంసూరు మండలంలోని వెన్న చెడు వెంకటాపురం రెవెన్యూ గ్రామంలో మర్లపాడు గ్రామానికి చెందిన రామిరెడ్డి సీతారామరెడ్డి తండ్రి వెంకటరామిరెడ్డి(లేటు )సర్వే నెంబరు 381 /ఊ, ఆ లో 2.30కుంటల భూమిలో పామాయిల్ సాగు చేసుకునేందుకు గాను మొక్కలను నాటించడం జరిగిందని రామిరెడ్డి సీతారామరెడ్డి మన తెలంగాణకు తెలిపారు. ఈనెల రెండవ తేదీ అనగా శుక్రవారం రాత్రి సుమారు పది గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పామాయిల్ తోటలో జొరబడి మొక్కలను పీకివేసి అపరించుకొని పోయినాడు అని తెలిపారు. సుమారు లక్ష రూపాయలు విలువైన మొక్కలు అపరించుకుని పోయినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మండల పరిధిలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న విషయం దితమే. మంత్రి తుమ్మల స్ఫూర్తితో పామాయిల్ సాగు చేసుకునేందుకు,అంతేకాకుండా పామాయిల్, వలన మంచి లాభదాయకంగా ఉంటుందని ఈ పామాయిల్ పంట దిగుబడి నిస్తుందని భావించి పామాయిల్ మొక్కలను వేయించటం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అపరించుకొని వెళ్లిన వ్యక్తిని కనుగొని తనకు నష్టపరిహారం ఇప్పించే విషయంలో తనకు న్యాయం చేయాలని సీతారామరెడ్డి కోరుతున్నారు. ఈ విషయాన్ని మంత్రు తుమ్మల నాగేశ్వరావు దృష్టికి తీసుకెళ్తున్నానని, అదేవిధంగా ఫారెస్ట్ అధికారుల దృష్టికి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయాన్ని
అధికారులకు తెలియజేస్తున్నానని సీతారామరెడ్డి పేర్కొన్నారు.
ఈ ఫామాయిల్ మొక్కలను అపహరించుకొని పోవడం పట్ల సీతారామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల రైతులు కూడా పామాయిల్ తోటలు వేసి మంచి లాభాలు పొందుతున్నారని, అదేవిధంగా తాను పామాయిల్ తోట పెంచుకునేందుకు మొక్కలను కొనుగోలు చేసి తెచ్చుకోవడం జరిగిందని, ఈ మొక్కలను అపహరించుకొని పోవడం పట్ల
ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *