రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ బక్కి వెంకటయ్య గారిని కలిసిన సేవాలాల్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ సంతోష్ నాయక్.

తేది:-04-01-2026 TSLAWNEWS ములుగు జిల్లా ఇన్చార్జ్ పోరిక రాహుల్ నాయక్.

ములుగు జిల్లా: ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ, బక్కి వెంకటయ్య గారిని సిద్దిపేటలో కలిసి ఈ మధ్య కాలంలో జరిగిన ఎస్సీ బాలికల హాస్టల్ భూపాలపల్లి లో జరిగిన సంఘటన మీద వారికి పూర్తి వివరాలు తెలియజేస్తూ హాస్టల్ లో ఉన్న బాలికను అకారణంగా కర్ర పట్టుకొని విచక్షణరహితంగా తిడుతూ కొట్టిన వార్డెన్ భవాని పైన మరియు ఆ హాస్టల్ లో రాత్రి సమయంలో ప్రవేచించిన వారిపైన చట్ట ప్రకారం శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని సేవాలాల్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ సంతోష్ నాయక్ కోరారు అలాగే తెలంగాణ రాష్ట్ర యాప్తంగా ఎస్టీ ఎస్సీ బాలుర బాలికల వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలలో నూతన మెనూ ప్రకారం భోజనం పెట్టాలని వారికి అన్ని వసతి సదుపాయాలను కల్పించి ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ముఖ్యంగా బాలికల వసతి గృహాలను రాష్ట అధికారులు స్థానిక పోలీస్ వారు కూడా నిత్యం ప్రత్యేకంగా ఫర్యవేక్షణ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని సంతోష్ నాయక్ రాష్ట్ర ఎస్సి, ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ, బక్కి వెంకటయ్య గారిని కోరగా, వెంటనే రాష్ట్ర అధికారులకు ఆదేశాలను ఇచ్చి ఇలాంటి సంఘటనలు మీద కట్టిన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *