6 వేల ఎకరాల భూములకు నీరు అందక సధర్మట్ బ్యారేజ్ వద్ద ధర్నాకు దిగిన ఎనిమిది గ్రామాల రైతులు – ఇరిగేషన్ అధికారులకు వినతి పత్రం అందజేత.

తేది:04-01-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇబ్రహీంపట్నం మండలం రిపోర్టర్ రాడే శ్రీనివాస్.

జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు చెందిన ఎనిమిది గ్రామాల రైతులు సధర్మట్ బ్యారేజ్ వద్ద ధర్నాకు దిగారు. రైతులు తమ భూములకు 6 వేల ఎకరాలకు పైగా నీరు అందకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు చెందిన వేములకుర్తి, యామపూర్, పకీర్ కొండాపూర్, సంగెం శ్రీరాంపూర్, మొగిలిపేట, ఓబులాపూర్, దామరాజుపల్లి, వాల్గొండ గ్రామాల రైతులు సుమారు 6 వేల ఎకరాలకు పైగా భూములకు సధర్మట్ బ్యారేజ్ నుండి గంగనాల ప్రాజెక్టు వరకు రెండు పంటలకు సరిపడా నీరు వదలాలని అధికారులకు కోరారు. నీరు నిల్వ ఉండేందుకు ఆయకట్టులు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ ఏ ఈ కవితకు వినతిపత్రం అందించామని రైతులు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *