పూజ గురువులు ష.బ్ర.108 శ్రీశ్రీ గురుగంగాధర శివచార్య మహాస్వామి వారి జయంతి కార్యక్రమం.

తేది:4-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశిపేట మండలం క్రైమ్ రిపోర్టర్ బి ప్రసాద్ గౌడ్.

సంగారెడ్డి జిల్లా, సదాశిపేట మండలం: తంగడపల్లి గ్రామంలో శ్రీ కోటి బిల్వ లింగేశ్వర మఠం, శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమం, జంగమయ్య గుట్ట వారి ఆధ్వర్యంలో పూజ గురువులు ష.బ్ర.108 శ్రీశ్రీ గురుగంగాధర శివచార్య మహాస్వామి వారి జయంతి కార్యక్రమం తేది:08-01-2026 రోజున ఉదయం 9 గంటలకు ప్రారంభించబడును, ఇట్టి కార్యక్రమంలో అప్పగారి యొక్క భవ్య మందిరం గర్భాలయ ప్రధాన ద్వార పూజా కార్యక్రమం, తదనంతరం వీరశైవ లింగాయత్ మరియు భక్తులు సర్పంచ్ ఉప సర్పంచ్ లకు పూజ గురువర్యులు ష.బ్ర.108 శ్రీశ్రీ శివయోగి శివచార్య మహా స్వాముల వారి కరకమలములచే ఆశీర్వాద మహోత్సవ కార్యక్రమం నిర్వహించటం జరుగుతుంది అని కరపత్రము ద్వారా తెలియజేశారు. కావున ఈ యొక్క మహోత్సవ కార్యక్రమానికి సమస్త భక్తాదులు విచ్చేసి గురు కృపకు పాత్రులు కాగలరని , అన్న ప్రసాదములను స్వీకరించి అప్పగార్ల యొక్క ఆశీస్సులు భక్త బృందానికి ఉంటుందని తెలియజేశారు. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: 9963540186, 9441937868, 9392385900. ఈ యొక్క కార్యక్రమం కు సంబంధించిన కరపత్రం వివరములను శ్రీ కోటి బిల్వ లింగేశ్వర మఠం శ్రీ గురు గంగాధర మహా స్వామి ఆశ్రమం జంగమయ్య గుట్ట వారు భక్త మహాశయులకు తెలియపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *