


తేది:04-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న శివసాయి టిఫిన్ సెంటర్లలో కనీస శుభ్రత పాటించకుండా కుళ్ళిపోయిన విషపూరిత ఆహార పదార్థాలు విక్రయించడంపై జగిత్యాల జిల్లా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఎన్నో సార్లు ఫుడ్ పాయిజన్ జరిగిందని ఆహార భద్రతా అధికారులు సదరు టిఫిన్ సెంటర్ లైసెన్స్ లు శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నశివసాయి టిఫిన్ సెంటర్లలో టిఫిన్ తిన్న కొద్దిసేపటికే 11 మంది వ్యక్తులు తీవ్రమైన వాంతులు, వికారంతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. విషయం తెలుసుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ శివసాయి టిఫిన్ సెంటర్ను తనిఖీ చేసి టిఫిన్ సెంటర్ను సీజ్ చేశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో పెను ప్రమాదం తప్పింది. స్థానిక తహసిల్ చౌరస్తా వద్ద ఉన్న ‘శివ సాయి టిఫిన్ సెంటర్’ లో హోటల్ యజమానుల నిర్లక్ష్యం బాధితుల ప్రాణాల మీదకు తెచ్చింది. టిఫిన్ చేయడానికి వచ్చిన వినియోగదారులకు వడ్డించిన చట్నీలో బల్లి కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.టిఫిన్ తిన్న కొద్దిసేపటికే పదకొండు మంది వ్యక్తులు తీవ్రమైన వాంతులు, వికారంతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. చట్నీలో బల్లి పడిందన్న విషయం గమనించేలోపే బాధితులు టిఫిన్ చేయడంతో ఈ ఫుడ్ పాయిజన్సం భవించింది.
అస్వస్థతకు గురైన వారందరినీ స్థానికులు తక్షణమే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ శివసాయి టిఫిన్ సెంటర్ను తనిఖీ చేసి టిఫిన్ సెంటర్ను సీజ్ చేశారు.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జగిత్యాల స్థానికులు:కనీస శుభ్రత పాటించకుండా ఆహార పదార్థాలు విక్రయించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహార భద్రతా అధికారులు స్పందించి, సదరు టిఫిన్ సెంటర్ లైసెన్స్ లు శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.