వరంగల్ గొర్రెకుంట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించిన సావిత్రిబాయి జ్యోతిబాపూలే జయంతి వేడుకలు.

తేది:03-01-2026 వరంగల్ జిల్లా TSLWANEWS ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.

వరంగల్ జిల్లా:నేడు గొర్రెకుంట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో సావిత్రిబాయి పూలే గారి జయంతి కార్యక్రమాన్ని అంబేడ్కర్ యువజన సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల. అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ బందెల మాట్లాడుతూ చాతూర్ వర్ణ వ్యవస్థలో బహుజనులకు, మహిళలందరికీ చదువుకునే హక్కు లేని రోజుల్లో మహాత్మ జ్యోతిరావు పూలే గారి దగ్గర చదువు నేర్చుకుని భారతదేశ మహిళా ఉపాధ్యాయురాలుగా బాలికల కోసం అనేక పాఠశాలలు ఏర్పాటు చేసి అందరికీ విద్యను అందించడం జరిగింది సమాజంలో ఉన్న సతీసహగమనం, అస్పృశ్యత, అంటరానితనానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసింది. ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవలు అందిస్తూ ప్లేగు వ్యాధి సోకి మరణించిందని తన జీవితం మొత్తాన్ని త్యాగం చేసి మహిళల్లో బహుజనుల అందరి జీవితాల్లో వెలుగు ను పంచిందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులకు గ్రామ పెద్దలు శాలవాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మాజీ MPTC పోలేపాక. సుమన్,నమిండ్ల. క్లిమెంట్, గ్రామ యువ నాయకులు మాచర్ల.కార్తీక్,సిలువేరు. రవి,మార.సాగర్,ల్యాదల్ల.ప్రశాంత్, ఇల్లందుల.చక్రి, సిలువేరు.సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *