అణగారిన వర్గాల చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే.

తేది:03-01-2026 హన్మకొండ TSLAWNWES నియోజకవర్గం ఇంచార్జ్ దోమటి పవన్.

హనుమకొండ జిల్లా: బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం రోజున ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు,
మొదట సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు,
అనంతరం మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్ మాట్లాడుతూ.
భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి తల్లి సావిత్రిబాయి ఫూలే అని అన్నారు.
కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి అని కొనియాడారు.
విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన మహనీయురాలు అని తెలిపారు.
కార్యక్రమంలో సీనియర్ నాయకులు సల్వాజీ రవీందర్ రావు, నయీముద్దీన్, బుద్దె వెంకన్న, పొలపల్లి రామ్మూర్తి, మహమూద్ గౌస్ ఖాన్, సౌరం రఘు, సంపతి రఘు, తక్కళ్లపల్లి వినీల్ రావు, సూరసి మహేష్, దరిగి రమేష్, గద్దెపాటి సాయి కుమార్, సల్మాన్, విజయ్ రెడ్డి, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *