ప్రజా ప్రభుత్వంలోనే అంగన్వాడీ కేంద్రాల బలోపేతం,సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి-గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్. ఘనంగా అక్షరాభ్యాసం విహెచ్ ఎన్ డి కార్యక్రమం.

తేది:03-01-2026 భూపాలపల్లి TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.

భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేస్తుందని ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ అన్నారు. శనివారం అంగన్వాడి సూపర్వైజర్ లక్ష్మీ ఆధ్వర్యంలో బీసీ కాలనీ అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం మూడవ నెంబర్ అంగన్వాడీలో వీ హెచ్ ఎన్ డి కార్యక్రమాన్ని సర్పంచ్ రాధిక శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు ఇందిర, శ్రావణి, దేవకమ్మ, వెంకటరమణ లతో పాటు ఏఎన్ఎం లుఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *