చిన్నారుల చిరునవ్వుల్లో నూతన సంవత్సరం పటాన్‌చెరు ప్రభుత్వ పాఠశాలలో పోలా స్వప్న సేవా సందడి.

తేది:03-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.

సంగారెడ్డి జిల్లా,పటాన్‌చెరు: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రముఖ సంఘసేవికురాలు పోలా స్వప్న పటాన్‌చెరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణ చిన్నారుల చిరునవ్వులు, హర్షధ్వనులతో పండుగ వాతావరణాన్ని తలపించింది.
ఈ సందర్భంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులతో ప్రతి తరగతిలో కేక్ కోసి, వారికి అవసరమైన విద్యాసామగ్రి మరియు ఇతర అవసరమైన వస్తువులను అందజేశారు. విద్యార్థులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని నూతన సంవత్సరాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో పోలా స్వప్న గారితో పాటు వారి కుమారుడు పోలా సాయి వరుణ్ తేజ, వారి మాతృమూర్తి, కొండూరి అనూరాధ, శ్రీధర్ తదితరులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. కార్యక్రమం మొత్తం స్నేహపూర్వకంగా, ఆనందభరితంగా సాగింది.
ఈ సందర్భంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పోలా స్వప్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో విద్యార్థులు మరింత కష్టపడి చదివి, తమ ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యనే జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బలమైన ఆయుధమని, చిన్న వయసులోనే మంచి లక్ష్యాలు పెట్టుకొని ముందుకు సాగాలని సూచించారు.
విద్యార్థులతో కలిసి ఈ విధంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని పోలా స్వప్న గారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *