

తేది:03-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా : జగిత్యాల వాసి డా. అరిగెల అభినవ్ కు అత్యుత్తమ పరిశోధన పత్రం అవార్డు లభించిందని తెలిపారు. హైదరాబాదులో 22వ అప్రస్కాన్ – 2025 అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ రికన్స్ట్రక్టివ్ సర్జన్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాన్ఫరెన్స్ లో జగిత్యాలకు చెందిన డా అభినవ్ సమర్పించిన పరిశోధన పత్రం అత్యుత్తమ పరిశోధన పత్రముగా ఎంపికైంది. అప్రస్కాన్ – 2025 అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ రికన్స్ట్రక్టివ్ సర్జన్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రదేశ్ గోల్డ్ మెడల్, నగదు బహుమతి ఇస్తూ డా .అభినవ్ ను అభినందించారు. కాగా డా .ఆభినవ్ జగిత్యాల ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అశోక్ కుమారుడు, ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది అధ్యాపకులు ఆభినవ్ ను అభినందించారు.