
తేది3-1-2026, జనగామ జిల్లా, TSLAWNEWS, పాలకుర్తి మండల రిపోర్టర్, Maroju Bhaasker.
జనగామ జిల్లా: శనివారం రోజు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా నాయకులు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా ని, జిల్లా విద్యా శాఖాధికారి పింకేష్ కుమార్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డి టి ఎఫ్ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను కలెక్టర్ రిజ్వాన్ భాషా జిల్లా విద్యాశాఖాధికారి పింకేష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయుల సంక్షేమంతో పాటు విద్యాభివృద్ధికి పాటు పడాలన్నారు.జిల్లా విద్యా శాఖాదికారి మాట్లాడుతూ ఉపాధ్యాయులు మెరుగైన విద్యాబోధన చేసి అత్యుత్తమ ఫలితాలు సాధించి జనగామ జిల్లా విద్యా శాఖను రాష్ట్రంలో ముందువరుసలో నిలపాల న్నారు. అందుకు డి టి ఎఫ్ జనగామ జిల్లా శాఖ సహకరించాలన్నారు. జిల్లా విద్యా కార్యాలయంలో ఉపాధ్యాయ సమస్యలు ఎప్పటికప్పుడుపరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటా మన్నారు.ఆ తర్వాత విడిగా జరిగిన కార్యకర్తల సమావేశం లో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. డి. షరీఫ్, ఇప్ప రాంరెడ్డి మాట్లాడుతూ పెండింగులో నున్న 5 డి ఏ లను విడుదలచేయాలని, పి ఆర్ సి ప్రకటించి అమలు చేయాలని, బకాయి పడ్డ పెన్షనరీ బెనిఫిట్స్ ను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరినారు. అతి తక్కువ వేతనంతో గొడ్డు చాకిరి చేస్తున్న కె జి బి వి ఉపాధ్యాయులకు పంచాయతీరాజ్, ప్రభుత్వ ఉపాధ్యులతో సమానంగా సెలవులు వాడుకొనుటకు అనుమతించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటి సభ్యులు ఎం. యాదయ్య, బి. చొక్కయ్య, బి. శివరాం, టి. శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జి. కళావతి, ఎం. శ్రీనివాసా చారి, వివిధ మండలాల బాధ్యులు సివాస రెడ్డి, అప్సర్, ఆంజనేయులు, నాగేందర్, దిలీప్ రెడ్డి, నాగరాజు, సీనియర్ సభ్యులు జగ్గారెడ్డి, స్టీఫెన్, ధర్మయ్య, రాజనర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.