తెలంగాణ దేవాదాయ శాఖ డైరెక్టర్ హరీష్ కి వినతి పత్రం అందచేస్తున్న-డి వి ఆర్ శర్మ-అర్చక ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి.

తేది:3-1-2026, జనగామ జిల్లా, TSLAWNEWS పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker.

జనగామ జిల్లా: శనివారం రోజు హైదరాబాద్ నుండి కొండగట్టు కు వెళ్తున్న సందర్భంగా వరంగల్ హరిత హోటల్ లో ఆగిన తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజ రామయ్యర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ ఎస్ హరీష్ దేవాదాయ శాఖ ఆగమ సలహాదారులు గోవింద హరినీ తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మెన్ గంగు ఉపేంద్ర శర్మ తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డి వి ఆర్ శర్మ ఇతర అర్చక సంఘాల నాయకులు వారిని కలిసి అర్చక ఉద్యోగ సమస్యలు వారికి వివరించడం జరిగింది.ప్రతి జిల్లా కేంద్రం లో అర్చక ఉద్యోగుల సమావేశాలు నిర్వహించుటకు జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ లకు కార్య నిర్వహణ అధికారులకు తగు సమాచారం అందించాలని అదే విధంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు ద్వారా వేతనాలు పొందుతున్న అర్చకులకు గత 3 నెలలుగు వేతనాలు రాలేదని తెలపడం తో డైరెక్టర్ హరీష్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులను చరవాణి లో సంప్రదించి వేతనాలకు సంబంధించిన టోకెన్ నంబర్లను వెంటనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారికి పంపమని ఆదేశించడం జరిగింది.తదనంతరం తెలంగాణ ఆర్ధిక శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానీయ తో మాట్లాడి వెంటనే వేతనాలు చెల్లించేలా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ కి అర్చక ఉద్యోగ సమస్యలు విన్నవించడం జరిగింది. జీ ఓ 121 రద్దు చేయాలని దాని ద్వారా ఇంకా సుమారు 1 వెయ్యి మంది తాత్కాలిక దినసరి అర్చక ఉద్యోగులను ముక్యంగా 4 వ తరగతి ఉద్యోగులను రెగ్యులర్ చేసే గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు చెల్లించే అవకాశం ఉందని తెలిపారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విభజన తర్వాత ప్రత్యేక దేవాదాయ శాఖ చట్టం లేదని ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చట్ట ప్రకారం ఇప్పటికీ తెలంగాణ దేవాదాయ శాఖ పరిపాలన జరుగుతుంది.పాత చట్టం అప్పటి ఆంధ్రా అధికారుల నిర్ణయాలతో జీ ఓ నం 888 మరియు 30/87మరియు 33/2007 వలన అర్చక ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పదోన్నతులలలో ,ఉద్యోగ భద్రతలో మరియు ప్రభుత్వ ప్రయోజనాలు పొందటం లేదని కావున అత్యవసరంగా తెలంగాణ దేవాదాయ శాఖ నూతన చట్టాన్ని తయారు చేసి దేవాలయ అర్చక ఉద్యోగుల ను దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఆఫీస్ నుండి కమీషనర్ ఆఫీసు సిబ్బందిని కూడా ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి వేతన చెల్లింపుల్లో ఉన్న అసమానతలను తొలగించి దేవాదాయ శాఖలో ఒకే శాఖ ఒకే వేతన విధానం అమలు చెయ్యాలని వారు కోరడం జరిగింది.ప్రిన్సిపల్ సెక్రరరీ శ్రీమతి శైలజ రామాయ్యర్ స్పందూస్తూ అర్చక వెల్ఫేర్ బోర్డు నుండి పదవి విరమణ పొందిన అర్చక ఉద్యోగులకు గ్రాడ్యూటీ గతంలో కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే దేవాదాయ శాఖ చెల్లించేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ చొరవతో ముఖ్యమంత్రి సహకారంతో 2 లక్షల గ్రాడ్యూటీ నీ 8 లక్షలకు పెంచడం జరిగినదని ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టామణి త్వరలో రాష్ట్ర స్థాయి లో అర్చక ఉద్యోగుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *