తేది:03-01-2026 సంగారెడ్డి జిల్లా,TSLAWNEWS, పటాన్చెరు నియోజకవర్గం కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్.
సంగారెడ్డి జిల్లా: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన విద్య బోధన అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.శనివారం సాయంత్రం రామచంద్రాపురం జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పాఠశాల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉచిత విద్యను అందించాలన్న సమున్నత లక్ష్యంతో పటాన్చెరు పట్టణంలో ప్రభుత్వ విద్యాసంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఇటీవల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సైతం ప్రారంభించడం జరిగిందని తెలిపారు.. అతి త్వరలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల సైతం ఏర్పాటు కాబోతుందని తెలిపారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉన్నత లక్ష్యంతో విద్యను అభ్యసించి చదువుకున్న పాఠశాలకు పుట్టిన ఊరుకు మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. మాదకద్రవ్యాల రహిత సమాజం ఏర్పాటులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.