అక్షరాలు దిద్దించిన ధీర వనిత సావిత్రిబాయి జ్యోతిబాపూలే-కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఉప్పరి విట్టల్.

తేది:03/01/2026 సంగారెడ్డిజిల్లా TSLAWNEWS సదాశివపేట మండలం క్రైమ్ రిపోర్టర్ బి.ప్రసాద్ గౌడ్.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో భారతదేశపు మొదటి మహిళ ఉపాద్యాయురాలిగా సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగాయి,ఈ సందర్భంగా కోనాపూర్ బక్కప్ప మాట్లాడుతూ మహిళల కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప సామాజిక విప్లవకారిణిగా చిరస్థాయిగా నిలిచిపోయారు,ఆమె చేసిన కృషి తన భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో చదువు కొనసాగిస్తూ,మహిళా హక్కుల కోసం ఆమె పోరాటం ఆమోగం,అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పనిచేశారు, గర్భిణులైన వితంతువులకు రక్షణ కల్పించడానికి ‘బాలహత్యా ప్రతిబంధక గృహాన్ని’ ఏర్పాటు చేశారు,​ఆమె గొప్ప రచయిత్రి కూడా. ‘కావ్య ఫూలే’, ‘బావన్న కాశి సుబోధ్ రత్నాకర్’ వంటి పుస్తకాల ద్వారా సమాజంలో చైతన్యం తెచ్చారు,
​ఆమె పాఠశాలకు వెళ్లేటప్పుడు, అప్పట్లో కొందరు సంప్రదాయవాదులు ఆమెపై రాళ్లు, పేడ విసిరేవారు. కానీ ఆమె అవేమీ లెక్కచేయకుండా, తన సంచిలో మరో చీరను తీసుకువెళ్లి, పాఠశాలకు చేరాక మార్చుకుని పిల్లలకు పాఠాలు చెప్పేవారు,​1897లో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు, రోగులకు సేవ చేస్తూ ఆమె కూడా ఆ వ్యాధి బారిన పడి ప్రాణాలు వదిలారు. నేడు ఆమె పుట్టినరోజైన జనవరి 3 ను భారత ప్రభుత్వం ‘మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం’గా గుర్తిస్తోంది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి కోనాపూర్ బక్కప్ప,జనరల్ సెక్రటరీ వెంటూరి శివ శంకర్,కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ బొడ నర్సింలు,అంజిరెడ్డి,కుమార్,ఆటుగారి శివ కుమార్,జ్యోతి రాజ్,మోహన్ రెడ్డి, రాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *