

తేది:03-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన విజయవంతంగా ముగిసింది. జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ సత్యప్రసాద్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. ప్రజలు, భక్తులు జిల్లా అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.
శనివారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని ఏపి డిప్యుటీ సిఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. వీరితో పాటు టిటిడి బోర్డు చైర్మన్ బి.ఆర్ నాయుడు మరియు టి టి డి సభ్యులు పాల్గొన్నారు.
మొదట హెలికాప్టర్ ద్వారా జేఎన్టీయూ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ వయోవృద్దులు, వికలాంగులు మరియు ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ టిటిడి సహకారంతో రూ 35.19 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 35.19 కోట్లతో దీక్ష విరమణ మండపం మరియు 96 గదుల వసతి సముదాయానికి శంకుస్థాపన చేశారు.
ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన
విజయవంతంగా ముగిసింది. జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ సత్యప్రసాద్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. ప్రజలు, భక్తులు జిల్లా అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.