డైట్ కళాశాల నూతన భవనాలకు భూమి పూజ.

తేది:3-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్ .

మెదక్ జిల్లా : శుక్రవారం నాడు మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలోని డైట్ కళాశాల సమీపంలో నిర్మించనున్న నూతన డైట్ కళాశాల భవనం, విద్యార్థుల హాస్టల్ మరియు మెస్ భవనాల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ గారు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారు, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
డైట్ కళాశాల మౌలిక సదుపాయాల అభివృద్ధితో భవిష్యత్తులో ఉపాధ్యాయ శిక్షణ మరింత మెరుగవుతుందని, విద్యార్థులకు నాణ్యమైన వసతులు అందుబాటులోకి వస్తాయని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.
అధికారులు, విద్యాశాఖ సిబ్బంది, స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *