


తేది:03-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా నాచుపల్లి జేఎన్టీయూ హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికిన తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.
అంజన్న ఆలయానికి చేరుకొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన పవన్ కళ్యాణ్.
జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లా కొండగట్టుకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సుమారు రూ.35.19కోట్ల వ్యయంతో నిర్మించనున్న వాయుపుత్ర సదన్ 100 గదుల ధర్మశాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ధర్మశాల నిర్మాణం ద్వారా భక్తులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయని పలువురు పేర్కొంటున్నారు. దీంతో ఒకేసారి 2000 మంది మాలధారణ దీక్ష విరమించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్ట్ తో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య భక్తిభావం, సహకారానికి ప్రతీకగా నిలువనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, టీటీడీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా అధికారులు కట్టుదిట్టమైన ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసారు.