
తేది:03-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.
సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం: రామచంద్రాపురంలోని వాసవి ఆర్యవైశ్య భవన్‌లో శుక్రవారం (02-01-2026) ఆర్యవైశ్య మహిళా మేఘా కిట్టీ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సుమారు 250 మంది మహిళలు హాజరుకాగా, అందులో 150 మంది కిట్టీలో సభ్యులుగా చేరేందుకు ముందుకు రావడం విశేషం.
కార్యక్రమానికి స్థానిక రాజకీయ నాయకులతో పాటు పటాన్‌చెరు ఆర్యవైశ్య మహిళా విభాగాన్ని కూడా ఆహ్వానించారు. మహిళల ఉత్సాహంతో భవన్ కోలాహళంగా మారి, సాంస్కృతిక వాతావరణం ఉట్టిపడింది.
ఈ సందర్భంగా శ్రీమతి యాదమ్మ మహిపాల్ రెడ్డి, గోదావరి అంజిరెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్ యాదవ్, కాటా సుధరాణి శ్రీనివాస్ గౌడ్ గార్లు మరియు పటాన్‌చెరు మహిళా విభాగం ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ మేఘా కిట్టీని రామచంద్రాపురం మహిళలు శ్రీమతి మడూరి జ్ఞానేశ్వరి మరియు శ్రీమతి నీల శ్రీలత ఆధ్వర్యంలో నిర్వహించారు. మహిళల ఐక్యత, సామాజిక చైతన్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగనుందని నిర్వాహకులు తెలిపారు.