పాఠశాలల మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలి-మండల విద్యాధికారి ఎన్. శంకర్. ప్రాథమిక పాఠశాల ఆత్మకూరు ఎస్సీ కాలనీ విద్యార్థుల విద్యా బోధన సామర్ధ్యాలను పరిశీలించిన-మండల విద్యాధికారి ఎన్. శంకర్.

తేది:2-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట మండలం రిపోర్టర్ ఎం ప్రభాకర్ గౌడ్.

ప్రాథమిక పాఠశాల ఆత్మకూరు ఎస్సీ కాలనీ విద్యార్థుల విద్యా బోధన సామర్ధ్యాలను పరిశీలించిన-మండల విద్యాధికారి ఎన్. శంకర్.

సంగారెడ్డి జిల్లా : పాఠశాలలో విద్యార్థులు ఉపయోగించే మరుగుదొడ్ల శుభ్రతను పరీక్షించే బాధ్యత ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ యొక్క ఏ ఏ పి సి చైర్మన్ మరియు గ్రామం యొక్క సెక్రటరీ పర్యవేక్షణలో మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని తెలియజేశారు. పాఠశాల పరిసరాలను తరగతి గదులను, ఆ పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ తో మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని,పాఠశాల పని వేళలో స్కావెంజర్ పాఠశాలలోనే ఉండాలని. మండల విద్యాధికారి యన్ శంకర్ తెలియజేయడం జరిగింది. పర్యవేక్షణలో భాగంగా ఈరోజు ప్రాథమిక పాఠశాల ఆత్మకూర్, ప్రాథమిక పాఠశాల ఆత్మకూరు ఎస్సీ కాలనీ విద్యార్థుల విద్యా బోధన సామర్ధ్యాలను పరీక్షించడం జరిగింది. మూడవ తరగతి చదువుతున్న విద్యార్థులను ఎఫ్ ఎల్ ఎస్ 2026 ఎగ్జామ్కు సన్నిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగరాణి మరియు సుమాలిని , సి అర్ పి మల్లేశం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *