ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో 1700 ప్రాంతాల్లో 4915 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయగా.. 666 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించామని పేర్కొన్నారు. అత్యంత సమస్మాత్మమైన 310 ప్రాంతాల్లో అదనపు ఫోర్స్ ఉంటుందని చెప్పారు.