8 ఫీట్ల వెడల్పుతో సైడ్ కాలువలు నిర్మించాలి-ఆర్ అండ్ బి అధికారులను కోరిన గాంధీనగర్ సర్పంచ్ సానుకూలంగా స్పందించిన అధికారులు.

 

తేది:01-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAW NEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.

భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం గాంధీనగర్ జంక్షన్ లో నూతనంగా చేపట్టిన రోడ్డు విస్తరణలో భాగంగా ఐదు ఫీట్లతో నిర్మించనున్న సైడ్ కాల్వను ఎనిమిది పీట్లకు పెంచాలని గాంధీనగర్ సర్పంచ్ ఇంజపెల్లి శ్రీనివాస్ ఆర్ అండ్ బి అధికారులకు శుక్రవారం విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని వర్షం నీరు మొత్తం మెయిన్ రోడ్డు సైడ్ కాలువలకు వస్తుందని దాంతో ఐదు ఫీట్ల నిడివి సైడ్ కాలువలు ఇబ్బందికరంగా మారుతుందని సర్పంచ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విషయంగా ఆర్ అండ్ బి అధికారులు స్పందించి సంబంధిత కాంట్రాక్టర్ ఎనిమిది ఫీట్ల సైడ్ కాలువల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సర్పంచ్ శ్రీనివాస్ అధికారులను కోరారు. ఈ విషయంగా గ్రామపంచాయతీ నుండి అధికారికంగా లేఖను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *