జగిత్యాల శివసాయి టిఫిన్ సెంటర్లో బల్లి వల్ల ఫుడ్ పాయిజన్ – పది మందికి అస్వస్థత – శివసాయి టిఫిన్ సెంటర్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు.

తేది:02-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లా కేంద్రంలో పెను ప్రమాదం తప్పింది. స్థానిక తహసిల్ చౌరస్తా వద్ద ఉన్న ‘శివ సాయి టిఫిన్ సెంటర్’ లో హోటల్ యజమానుల నిర్లక్ష్యం బాధితుల ప్రాణాల మీదకు తెచ్చింది. శుక్రవారం ఉదయం టిఫిన్ చేయడానికి వచ్చిన వినియోగదారులకు వడ్డించిన చట్నీలో బల్లి కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
టిఫిన్ తిన్న కొద్దిసేపటికే ఎనిమిది మంది వ్యక్తులు తీవ్రమైన వాంతులు, వికారంతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. చట్నీలో బల్లి పడిందన్న విషయం గమనించేలోపే బాధితులు టిఫిన్ చేయడంతో ఈ ఫుడ్ పాయిజన్ సంభవించింది.
అస్వస్థతకు గురైన వారందరినీ స్థానికులు తక్షణమే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. బాధితుల పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు, జన సంచారం ఎక్కువగా ఉండే తహసిల్ చౌరస్తా వంటి ప్రాంతంలో కనీస శుభ్రత పాటించకుండా ఆహార పదార్థాలు విక్రయించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహార భద్రతా అధికారులు వెంటనే స్పందించి, సదరు టిఫిన్ సెంటర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ శివసాయి టిఫిన్ సెంటర్ కు వెళ్లి తనిఖీలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *