ఉర్సు ఉత్సవాల్లో సామాజిక సమైక్యతకు నిదర్శనం – పటాన్‌చెరులో దర్గా వద్ద బీఆర్ఎస్ నేతల ప్రార్థనలు.

తేదీ: 01-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.

సంగారెడ్డి జిల్లా,పటాన్‌చెరు: పటాన్‌చెరు పట్టణంలోని హజ్రత్ సయ్యద్ నిజాముద్దీన్ షా దర్గాలో ఈ ఏడాది నిర్వహించిన ఉర్సు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో మాద్రి పృథ్వీరాజ్ బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్‌గా, పటాన్‌చెరు కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారితో కలిసి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ ఉర్సు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఈ సందర్భంగా మాద్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ, “ఉర్సు ఉత్సవాలు భక్తుల సంకల్పానికి, సామాజిక సమైక్యతకు ప్రతీక. అన్ని మతాల ప్రజల మధ్య శాంతి, సౌహార్దం పెంపొందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మత పెద్దలు, ఉత్సవ నిర్వాహకులు, స్థానిక నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలకు ప్రత్యేక శోభను చేకూర్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *