
తేదీ:01-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.
సంగారెడ్డి జిల్లా:నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2026 సంవత్సరం తెలంగాణ ప్రజలకు సుఖసంతోషాలు, శాంతి, అభివృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందడుగు వేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరింత విస్తరించాలని కోరారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ, తెలంగాణను అభివృద్ధి పథంలో నిలిపే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని నీలం మధు ముదిరాజ్ విశ్వాసం వ్యక్తం చేశారు.