నూతన సంవత్సరం వేళ సమాజంలో మార్పు సంకేతాలు – కుటుంబాలకే ప్రాధాన్యం, మద్యం అమ్మకాలలో తగ్గుదల.

తేదీ: 01-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.

సంగారెడ్డి జిల్లా: నూతన సంవత్సర వేడుకల అనంతరం సమాజంలో గమనించదగిన మార్పులు కనిపిస్తున్నాయి. ప్రజలు ఆలయ దర్శనాలతో పాటు తమ కుటుంబాలతో సమయం గడపడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడం, జీవనశైలిలో సానుకూల మార్పులే ఇందుకు కారణమని స్థానికులు చెబుతున్నారు.
ప్రత్యేకంగా అమీన్పూర్, పటాన్‌చెరు, బీహెచ్ఈఎల్, బీరంగూడ ప్రాంతాల్లో 2024, 2025 సంవత్సరాలతో పోలిస్తే ఈసారి మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గినట్లు సమాచారం. పండుగ రోజుల్లో కూడా గతంతో పోలిస్తే మద్యం విక్రయాలు తగ్గడం విశేషంగా మారింది.
కుటుంబాలతో కలిసి సమయం గడపడం, పిల్లలతో ఆనందంగా గడపాలనే భావన పెరగడంతో చాలా మంది మద్యం వినియోగాన్ని తగ్గిస్తున్నారని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో కొంతమంది యువత నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మద్యం పూర్తిగా మానేయాలనే తీర్మానాలు (రిజల్యూషన్లు) తీసుకోవడం సామాజికంగా ఆశాజనక పరిణామంగా మారింది.
ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు అడుగులు వేస్తూ, కుటుంబ బంధాలకు ప్రాధాన్యం ఇస్తున్న ఈ మార్పులు సమాజంలో సానుకూల వాతావరణాన్ని తీసుకువస్తున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *