కోటగుళ్లలో ఆలయానికి నూనె వితరణ,పూజలు నిర్వహించిన-మాజీ గ్రంథాలయ చైర్మన్ దంపతులు.

తేది:01-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.

భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో గురువారం భూపాలపల్లి మాజీ గ్రంథాలయ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ సునీత దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయానికి నూనె క్యాన్లను రమేష్ గౌడ్ సునీత దంపతులు అందజేశారు. ఆలయానికి నూనెను అందజేసిన దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *