మేయర్ కు శుభాకాంక్షలు తెలిపిన కమిషనర్.

తేది:01-01-2026 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.

వరంగల్ జిల్లా : మేయర్ కు పూల మొక్క అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ కమిషనర్.
గురువారం నూతన ఆంగ్ల సంవత్సరాన్ని (01 జనవరి 2026) పురస్కరించుకొని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ నగర మేయర్ గుండు సుధారాణి నీ బల్దియా ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపిన మేయర్ మాట్లాడుతూ ఈ నూతన సం.లో నగరం మరింత పురోభివృద్ధిలో దూసుకువెళుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *