
తేది 01-01-2026 వరంగల్ జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
వరంగల్ జిల్లా : గొర్రకుంటలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శౌర్య దివాస్ నీ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల అరుణ్ కుమార్ మాట్లాడుతూ 1818 సంవత్సరం ముందు మారాట పీష్వా రాజ్య పరిపాలనలో శూద్రులు అతిశూద్రులు విధుల్లో తిరగడం నిషేధం మూతికి ముంత,నడుముకు చీపురు కట్టుకొని మిట్ట మధ్యాహ్నం ఎవరి ఇండ్లపై నీడ పడకుండా తిరగాల్సిన రోజులు కానీ 1818 జనవరి 1వ తేదీన మహారాష్ట్ర లోనీ పుణె దగ్గర కోరేగావ్ గ్రామంలో కేవలం 500 మహార్ సైన్యం 28000 వేలమంది మరాఠా పీష్వా బ్రాహ్మణ రాజ్య సైన్యంపై విరోచితంగా పోరాడి విజయం సాధించారంటే వాళ్లు ఆ రోజుల్లో ఎంత అణచివేతకు, అస్పృశ్యతకు, అవమానాలకు గురైనారో అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క విజయం తర్వాతనే శూద్రులైన మహాత్మ జ్యోతిరావు పూలే లాంటి వారికి చదువుకునే అవకాశం కలిగిందని , డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1927 జనవరి 1 న భీమా కోరేగావ్ స్థూపాన్ని సందర్శించి దీనిని ఆత్మగౌరవ పోరాటంగా స్ఫూర్తి పొందాలని దీనిని విజయ్ దివాస్ గా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని పిలుపునిచ్చారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.