తేది:01-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా కేంద్రంలోని బాల సదన్ లో జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ గారు పిల్లలతో కలిసి, ఆత్మీయ వాతావరణంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలతో మమేకమై మాట్లాడిన ఆయన, వారి అభిరుచులు, చదువుపై ఆసక్తి, భవిష్యత్ లక్ష్యాల గురించి తెలుసుకున్నారు.
పిల్లలకు నోట్‌బుక్స్ పంపిణీ చేసి, విద్యే జీవితంలో విజయానికి బలమైన పునాది అని, కష్టపడి చదువుకుంటే ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ప్రోత్సహించారు. ప్రతి బాలుడు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, క్రమశిక్షణ, కష్టపడే స్వభావం అలవర్చుకోవాలని సూచించారు.
పిల్లల భవిష్యత్తే సమాజ భవిష్యత్తు అని పేర్కొన్న జిల్లా ఎస్పీ, బాలల సంరక్షణ, విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం పిల్లల్లో కొత్త ఉత్సాహం, ఆశాభావాన్ని నింపడంతో పాటు, నూతన సంవత్సరాన్ని ఒక మంచి సందేశంతో ప్రారంభించినట్టుగా నిలిచింది.