జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు – జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్.

తేది: 01-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: నూతన సంవత్సరం 2026 సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గడిచిన సంవత్సరం జిల్లా పోలీస్ శాఖకు ఎంతో కీలకమైనదిగా నిలిచిందని తెలిపారు. పోలీస్ శాఖలో అనేక నూతన ఒడవడికలు, ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు, సిబ్బంది పూర్తి స్థాయి కార్యనిబద్ధతతో విధులు నిర్వర్తించేందుకు ఇది ఎంతో దోహదపడిందని పేర్కొన్నారు.
కొత్త సంవత్సరంలో కూడా జిల్లా పోలీస్ సిబ్బంది మరింత అంకితభావంతో, క్రమశిక్షణతో తమ తమ విధులను నిర్వహిస్తూ జిల్లాలో నేర శాతాన్ని నియంత్రించాలని సూచించారు. బేసిక్ పోలీసింగ్ విధానాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు చేరువయ్యే విధంగా పని చేయాలని, ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచుకునేలా సేవలు అందించాలని ఎస్పీ గారు సూచించారు.
నూతన సంవత్సరపు సందర్భంగా జిల్లా పోలీస్ శాఖలోని అన్ని విభాగాలలో, అన్ని స్థాయిలలో ఉన్న అధికారులు మరియు సిబ్బంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ సూచించారు. ఆరోగ్యవంతమైన సిబ్బందే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది అని పేర్కొన్నారు.
గత సంవత్సరం జిల్లాలో శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. వారి అంకితభావం, కృషి వల్లే జిల్లా వ్యాప్తంగా శాంతియుత వాతావరణం కొనసాగుతోందని తెలిపారు.
అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులు మరియు సిబ్బంది జిల్లా ఎస్పీకి పుష్పగుచ్ఛాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ శేషాద్రిని రెడ్డి ఐపీఎస్, డీఎస్పీలు వెంకటరమణ,వెంకటరమణ, రఘు చందర్, రాములు, వివిధ పోలీస్ స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *