
తేదీ:1-1-2026 TSLAW NEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా : బుధవారం నాడు పాపన్నపేట మండలం లక్ష్మీ నగర్ గ్రామంలో ఉన్న గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలో అందుబాటులో ఉన్న యూరియా, డీఏపీ, పొటాష్ తదితర ఎరువుల స్టాక్ వివరాలు, బిల్లులు, రిజిస్టర్లు పరిశీలించారు. ప్రభుత్వ నిర్దేశిత ధరలకే ఎరువులు విక్రయిస్తున్నారా, నిల్వలు సరిపడా ఉన్నాయా అనే అంశాలపై దృష్టి సారించారు.
అక్కడికి వచ్చిన రైతులతో కలెక్టర్ గారు నేరుగా మాట్లాడి ఎరువుల లభ్యత, ధరలు, సరఫరాలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని తెలుసుకున్నారు. రైతులు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. నకిలీ ఎరువుల విక్రయానికి తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులను మోసం చేసే చర్యలు సహించబోవని స్పష్టం చేశారు.
రైతులకు వ్యవసాయ ఇన్‌పుట్లు సకాలంలో అందేలా నిరంతర తనిఖీలు నిర్వహించాలని, నిల్వలు పారదర్శకంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ గారు పేర్కొన్నారు.