తేది:01-01-2026 TSLAWNEWS ములుగు జిల్లా ఇన్చార్జ్ పోరిక రాహుల్ నాయక్.
ములుగు జిల్లా: డీఎస్పీ ఎన్. రవీందర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన శౌర్య పథకంను ప్రదానం చేసింది. తన సేవా కాలంలో చూపిన అసాధారణ ధైర్యసాహసాలు, కర్తవ్యనిష్ఠకు గాను ఈ పురస్కారం అందించబడింది.
ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్ పి శ్రీ సుధీర్ రామనాథ్ కేకాన్ ఐపీఎస్ గారు డీఎస్పీ ఎన్. రవీందర్ గారిని ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సత్కరించారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వం డి ఎస్ పి గారు చేసిన కఠినమైన అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు నిరోధక చర్యల్లో చేసిన కృషికి, వరద సహాయక చర్యల్లో, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో, గ్రామపంచాయతీ ఎన్నికలు మరియు మేడారం మహాజాతర నిర్వహణలో డీఎస్పీ రవీందర్ గారు చూపిన ధైర్యం, సమర్థత ప్రశంసనీయమని ఎస్పీ గారు పేర్కొన్నారు.
ఇలాంటి అధికారులు జిల్లా పోలీస్ విభాగానికి గర్వకారణమని, యువ పోలీస్ అధికారులకు ఆదర్శంగా నిలుస్తారని ఎస్ పీ గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.