తేది:01-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ బి.సత్య ప్రసాద్ ఐ ఏ ఎస్, జగిత్యాల జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం 2026, జిల్లా ప్రజలందరికీ ఆరోగ్యం, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రజల సహకారం కొనసాగాలని, జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు నడిపేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ప్రజలందరూ ఐక్యతతో ముందుకు సాగుతూ జిల్లా అబివృద్దిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ కోరారు.