
తేది:31-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్న గారికృష్ణ గౌడ్.
సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి జిల్లాలో నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని భద్రతాభావం కొరకు, శాంతి భద్రతలను కాపాడుట కొరకు అందరూ బాధ్యతాయుతంగా సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలి, అంతేగాని నూతన సంవత్సర వేడుకల పేరుతో సామాన్య ప్రజానీకానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడాన్ని తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని జిల్లా ప్రజలకు సూచించారు. డిసెంబర్ 31 వేడుకలకు సంబంధించి ఎలాంటి అక్రమ మద్యం రవాణా జరగకుండా ఇప్పటికే వాహనాల తనిఖీలు ప్రారంభంబించడం జరిగిందని, డిసెంబర్ 31 రోజు సాయంత్రం నుండి పోలీసు బృందాలు విస్తృతస్థాయిలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను జిల్లా వ్యాప్తంగా కట్టు దిట్టంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.