ఈ చిత్రం గల్ఫ్ దేశాలలో (యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమన్, బహ్రెయిన్) మరియు పాకిస్థాన్‌లో విడుదల కాలేదు. చిత్రంలోని పాకిస్థాన్ వ్యతిరేక కంటెంట్ మరియు కథాంశంపై అభ్యంతరాల కారణంగా ఆయా దేశాలు నిషేధం విధించాయి. దీనివల్ల సుమారు రూ. 90 కోట్ల (10 మిలియన్ డాలర్లు) బాక్సాఫీస్ ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రణబ్ కపాడియా వెల్లడించారు. సాధారణంగా ఇండియన్ యాక్షన్ సినిమాలకు గల్ఫ్ మార్కెట్‌లో విపరీతమైన ఆదరణ ఉంటుందని, ఒకవేళ అక్కడ విడుదలయ్యి ఉంటే వసూళ్లు మరిన్ని రికార్డులను బద్దలు కొట్టేవని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆర్థికంగా ఈ గట్టి దెబ్బ తగిలినప్పటికీ, ‘ధురంధర్’ ప్రభంజనం మాత్రం ఆగలేదు. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం కేవలం 26 రోజుల్లోనే రూ. 1,128.63 కోట్ల మార్కును అందుకుంది. ఇది భారతదేశంలో రూ. 750 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా చరిత్ర సృష్టించింది. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్ వంటి భారీ తారాగణం మరియు ఆదిత్య ధర్ గ్రిప్పింగ్ మేకింగ్ ఈ స్థాయి విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
ఈ భారీ విజయంతో ఉత్సాహంలో ఉన్న చిత్రబృందం ఇప్పటికే ‘ధురంధర్ 2’ సీక్వెల్‌ను ప్రకటించింది. ఈ సీక్వెల్ 2026 మార్చి 19న రంజాన్ (ఈద్) కానుకగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 30, 2026 నుండి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. కొత్త సంవత్సరంలో కూడా ఈ చిత్రం మరిన్ని రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.