
తేది:31-12-2025 TSLAW NEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.
మెదక్ జిల్లా: నల్గొండ జిల్లా కలెక్టర్ గా పద్మశాలి ముద్దుబిడ్డ బడుగు చంద్రశేఖర్ నియామకం పట్ల మెదక్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాకల జయరాములు నేత,మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు తలకొక్కుల శ్రీనివాస్ నేత,పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు వనం నర్సింలునేతలు ఓక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.ఈసందర్భంగా మెదక్ జిల్లా అధ్యక్షులు మ్యాకల జయరాములు మాట్లాడుతూ పద్మశాలి ముద్దు బిడ్డలు ఉద్యోగ, వ్యాపార సంఘాల వారిగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.