తేది:31-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAW NEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ లు గ్రామ ప్రజలకు 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన ఆంగ్ల సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. గ్రామ ప్రజలు, భూపాలపల్లి ఎమ్మెల్యే సహకారంతో 2026 సంవత్సరంలో గ్రామ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. పాలన వ్యవహారాల్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు అధికారులు సహకరించాలని సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ లు విజ్ఞప్తి చేశారు.