తేది:31-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం చెల్పూర్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెల్పూర్ సర్పంచ్ కావటి రజిత రవీందర్ అన్నారు. బుధవారం ఆమె ఆసుపత్రిని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల కోసం వచ్చే రోగులకు నిరంతరం వైద్యం అందేలా చూడాలన్నారు. సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ను వైద్య సిబ్బంది ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వాతి , గౌతమ్,ఆయుష్ డాక్టర్ గీత, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్స్, టెక్నిషన్,పంచాయతీ కార్యదర్శి హేమంత్ గౌడ్ దారకొండ నాగరాజు, పెరక మనోహర్, కారోబార్ వేణు లు పాల్గొన్నారు.