వే బ్రిడ్జి కొలతలతో ఖచ్చితత్వం మెరుగుపడుతుంది,భూపాలపల్లి సింగరేణి జిఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ఓపెన్ కాస్ట్- 3 నూతన వే బ్రిడ్జ్ ప్రారంభింన జిఎం.

తేది:31-12-2025 భూపాలపల్లిజిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.

భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం వే బ్రిడ్జి కొలతలతో ఖచ్చితత్వం మెరుగుపడుతుందని భూపాలపల్లి సింగరేణి జిఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అన్నారు . బుధవారం గణపురం మండల లోని సింగరేణి ఓపెన్ కాస్ట్ త్రీలో నూతనంగా నిర్మించిన వే బ్రిడ్జ్ సింగరేణి అధికారులతో కలిసి జిఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా నిర్మించిన వే బ్రిడ్జి ప్రారంభంతో బొగ్గు రవాణా, కొలతల ఖచ్చితత్వం మరింత మెరుగుపడుతుందని తెలిపారు. దీంతో ఉత్పత్తి ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు పారదర్శకత కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *