తేదీ:31-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గం కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్.
సంగారెడ్డి జిల్లా: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో సిజిఆర్ తన సొంత నిధులతో ప్రజాసేవలు నిర్వహించడం పట్ల మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. బుధవారం గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో మహిళా సంఘాల సభ్యులు సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డిని సన్మానించారు. గుమ్మడిదల పరిధిలో పలు ప్రాంతాల్లో కోతులను పట్టించి ప్రజలను కోతుల బారి నుంచి విముక్తి కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇదే తరహాలో తమ ప్రాంతాల్లోనూ కోతులను పట్టించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, రామన్న ,మొగులయ్య, సత్యనారాయణ, ప్రేమలత, పొన్నాల శ్రీనివాస్ రెడ్డి,వాసు దేవ రెడ్డి, సూర్యనారాయణ,జయపాల్ రెడ్డి, చంద్రారెడ్డి, బాల్ రెడ్డి, నర్సింలు, శంకర్,శ్రీను,లక్ష్మణ్ రాజు, మహిళలు పాల్గొన్నారు.