తేదీ:31-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గం కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్.
సంగారెడ్డి జిల్లా: హత్నూర మండలం నాగారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ వారాల వీరేష్ యాదవ్ వీధి దీపాలను ఏర్పాటు చేశారు. బుధవారం గ్రామంలో ఆయన పర్యటించి వీధి దీపాలు మరమ్మత్తులు చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో వీధి దీపాలు లేకపోతే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని ముందస్తు చర్యలో భాగంగా వీధి దీపాలు మరమ్మత్తులు చేస్తున్నామన్నారు, రాత్రి సమయాల్లో అవసరాల నిమిత్తం ప్రజలు బయటకి వస్తే విద్యుత్ దీపాలు లేకపోతే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వీధి దీపాలను మరమ్మతులు చేస్తున్నామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.