అక్రమంగా కేసులు పెట్టి చంద్రబాబును 53 రోజులు జైల్లో పెడితే.. రూ.వేల కోట్లు లూటీ చేసిన జగన్ ను ఎక్కడ పెట్టాలని టీడీపీ నేత లోకేశ్ ప్రశ్నించారు. జగన్, ఆయన మంత్రులకు కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ కేసులు ఎదుర్కోక తప్పదన్నారు. వైసీపీ బస్సు యాత్రలు తుస్సు యాత్రలయ్యాయని ఎద్దేవా చేశారు. వై ఏపీ నీడ్స్ సైకో అని ప్రజలు అడుగుతున్నారని విమర్శించారు.