తేది:30-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇన్చార్జ్ విజయ్ మురళి కృష్ణ.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా: కడ్తాల్ మహేశ్వర పిరమిడ్ సమీపంలో గల సప్త ఋషుల ఆశ్రమం వ్యవస్థాపకురాలైన ఆది వరలక్ష్మి గారు ఆశ్రమం ప్రత్యేకతలో భాగంగా మాట్లాడుతూ గంధ సింధూరం చెట్టు యొక్క ప్రత్యేకతను వివరించి ప్రకృతి వనం యొక్క గొప్పతనాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు. అక్కడికి విచ్చేసిన పిరమిడ్ ధ్యానులు ప్రకృతి యొక్క విలువలను తెలుసుకొని సప్త ఋషుల ఆశ్రమం ప్రత్యేకతకు ముగ్ధులయ్యారు.